Ricky Ponting: టీమిండియా మరో భారీ ఓటమిని చూడబోతోంది

వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియా(Team India)పై ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ ప్లేయర్ రికీ పాంటింగ్(Ricky Ponting) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-06 16:57 GMT
Ricky Ponting: టీమిండియా మరో భారీ ఓటమిని చూడబోతోంది
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియా(Team India)పై ఆస్ట్రేలియన్ మాజీ స్టార్ ప్లేయర్ రికీ పాంటింగ్(Ricky Ponting) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత జట్టుపై మాట్లాడారు. ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య జరుగబోయే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ(Border–Gavaskar Trophy)లో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. 03-01తో ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. స్టీవ్ స్మిత్(Steve Smith) లేదా రిషబ్ పంత్‌(Rishabh Pant) అత్యధిత పరుగులు చేసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు.. ఆసిస్ బౌలర్ హేజిల్‌వుడ్(Hazlewood) అత్యథిక వికెట్లు తీస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. సొంత గడ్డపై మొదటిసారి వైట్‌వాష్‌కు గురైంది.

Tags:    

Similar News