కామెంటరీ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

కాన్బెర్రా: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కామెంటరీ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు.Latest Telugu News

Update: 2022-08-15 12:04 GMT

కాన్బెర్రా: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కామెంటరీ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. 45 ఏళ్లు కెమెంటరీ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇటీవల సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'క్రికెట్ కెరీర్ నుంచి తప్పుకోవాలని అనుకున్న రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ రోజు నా వాచ్‌లో టైమ్ 11 దాటింది. ఆ రోజు డిసైడ్ అయ్యా క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకోవాలని. ఇప్పుడు కామెంటరీ కెరీర్‌పై కూడా నిర్ణయం తీసుకున్నా.. గత కొన్నేళ్లు నా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గుండెపోటు కూడా వచ్చింది. ప్రాణాపాయం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డాను. ఎక్కడికి వెళ్లినా త్వరగా అలసిపోతున్నాను. అప్పుడు రగ్బీ లీగ్ కామెంటేటర్ లెజెండరీ రే వారెన్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఒక తప్పు చేయడానికి అడుగు దూరంలో మీరున్నారని అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యా.. కామెంటరీని వదిలేద్దామని.' అని వెల్లడించారు. 1977లో ఇయాన్ చాపెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచి కామెంటెటర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు.

Tags:    

Similar News