అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి మణిపూర్ ఆతిథ్యం..

Update: 2023-03-21 14:04 GMT

న్యూఢిల్లీ: మణిపూర్ ప్రజలకు నిజంగా ఇది పండగే. ఎందుకంటే వారికి ఫుట్‌బాల్ అంటే విపరీతమైన అభిమానం. అటువంటి రాష్ట్రంలో అంతర్జాతీయ టోర్నీ జరుగుతుందంటే వాళ్లకు పండగే కదా మరి. అవును అంతర్జాతీయ ముక్కోణపు ఫుట్‌బాల్ టోర్నీకి మణిపూర్ ఆతిథ్యమివ్వనుంది. బుధవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత జట్టుతో పాటు కిర్గిస్తాన్, మయన్మార్ జట్లు ఖుమన్ లాంపాక్ స్టేడియంలో తలపడతాయి. తొలి మ్యాచ్‌లో భారత, మయన్మార్ జట్లు ఆడనున్నాయి. ఇటీవలే బెంగళూరు ఎఫ్‌సి జట్టుకు నేతృత్వం వహించిన సునీల్ ఛెత్రీ ఈ టోర్నీలోనూ నాయకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది ఆసియా కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు.

అంతేకాదు యువకులు కూడా ఈ అవకాశాలను సద్వినయోగం చేసుకుని రాబోయే పెద్ద టోర్నీల కోసం సిద్ధపడాలని కోరుకుంటున్నారు. మయన్మార్‌లో పోరు తర్వాత ఆతిథ్య భారత జట్టు ఈ నెల 28న కిర్గిస్తాన్‌తో ఆడుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా మణిపూర్ ఈ టోర్నీకి సిద్ధమైంది. కొంత మంది బ్లూ టైగర్స్ ప్లేయర్స్ క్రమం తప్పకుండా స్థానిక టోర్నీల్లో ఆడుతున్నారు. దీంతో కొన్నేళ్లుగా ఈ రాష్ట్రం జాతీయ జట్టుకు టాప్ ప్లేయర్స్‌ను అందిస్తోంది. కానీ అంతర్జాతీయ టోర్నీల విషయానికొస్తే మాత్రం పుట్‌బాల్ అంటే పిచ్చి అభిమానమున్న రాష్ట్రానికి ఇది తొలిసారి. ‘ఇంపాల్‌లో ఈ టోర్నీ జరుగుతుందని ప్రకటించినప్పటి నుంచి నాకు ఇంటి కాడి నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి’ అని భారత జట్టు డిఫెండర్ చింగ్లెన్‌సనా కాన్షమ్ చెప్పాడు.

Tags:    

Similar News