FIFA World Cup 2022 : అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో: మాథ్యూస్

జర్మనీ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు లోథర్ మాథ్యూస్ పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డోపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Update: 2022-12-20 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు లోథర్ మాథ్యూస్ పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డోపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫిఫా వరల్డ్ కప్ 2022 అట్టర్ ఫ్లాప్ ప్లేయర్ రొనాల్డో అని విమర్శించాడు. రోనాల్డోకి ఉన్న అహం పోర్చుగల్ జట్టును, అతడిని దెబ్బతీసిందని తెలిపారు. రొనాల్డో అతడి లెగసీని శాశ్వతంగా దెబ్బతీసుకున్నాడని పేర్కొన్నారు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌ను వీడిన రొనాల్లో.. మరో క్లబ్ తరుఫున ఆడుతాడని తాను ఊహించుకోలేనన్నారు. రొనాల్డోను చూస్తే జాలి వేస్తుందని మాథ్యూస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక, ఈ ఏడాది ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌ను స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో ప్రత్యర్థి ఫ్రాన్స్‌ను చిత్తుచేసి.. ఫిఫా వరల్డ్ కప్ టైటిల్‌ను అర్జెంటీనా ఎగరేసుకుపోయింది. స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్లో కెప్టెన్సీలో బరిలోకి దిగిన పోర్చుగల్.. క్వార్టర్ ఫైనల్స్‌లో పరాజయం పాలైంది. క్యార్టర్ ఫైనల్‌లో మొరాకో చేతిలో ఓటమి పాలై.. కప్ సాధించకుండానే పోర్చుగల్ ఇంటి బాట పట్టింది.

Tags:    

Similar News