హార్దిక్ గుజరాత్ టైటాన్స్ ను వీడినా వచ్చే నష్టమేమీ లేదు- షమీ
గుజరాత్ జట్టును ఎవరు వీడినా పెద్దగా నష్టమేమీ లేదన్నాడు సీనియర్ పేసర్ షమీ. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను వదిలి ముంబై జట్టుతో చేరిన సంగతి తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్: గుజరాత్ జట్టును ఎవరు వీడినా పెద్దగా నష్టమేమీ లేదన్నాడు సీనియర్ పేసర్ షమీ. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను వదిలి ముంబై జట్టుతో చేరిన సంగతి తెలిసిందే. వీటి గురించి టీమిండియా సీనియర్ పేసర్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ షమీ స్పందించాడు. ఎవరు జట్టును వీడినా పెద్దగా నష్టమేమీ లేదన్నాడు. జట్టు కూర్పు బ్యాలెన్స్ డ్ గా ఉందా లేదా అన్నదే చూడాలన్నాడు. హార్దిక్ గతంలో కెప్టెన్ గా ఉన్నాడు. రెండు సీజన్లలోనూ ఫైనల్ కు తీసుకెళ్లాడన్నాడు. ఓసారి గెలిపించాడని అన్నారు. గుజరాత్ టైటాన్స తో హార్దిక్ జీవిత కాలం ఒప్పందమేమీ చేసుకోలేదన్నాడు. జట్టులో ఉండటం.. వీడటం.. అనేది అతడి నిర్ణయం అని పేర్కొన్నాడు. ప్రస్తుతం శుభమన్ కెప్టెన్ అయ్యాడని అన్నాడు. సారథిగా శుభమన్ కు ఎక్సీపిరయన్స్ వస్తుందన్నాడు. ఏదో ఒకరోజు గిల్ కూడా జట్టును వీడే ఛాన్స్ ఉందన్నాడు. ఆటలో ఇవన్నీ సహజమని.. ప్లేయర్లు వస్తూ ఉంటారు..పోతూ ఉంటాని షమీ కామెంట్స్ చేశాడు.
రెండేళ్ల క్రితం ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే విజేతగా నిలిచింది. గతేడాది రన్నరప్ గా నిలించింది. రెండు సీజన్లకు కెప్టెన్ గా హార్టిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. కానీ, ఐపీఎల్ -2024 వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ ను వీడి ముంబై ఇండియన్స్ కు మారాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్-2023లో 17 మ్యాచ్‌లు ఆడిన షమీ.. 28 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. గిల్ 17 మ్యాచ్‌లలో కలిపి 890 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.