శభాష్ Arshdeep Singh.. ఆ ఒక్క మాటకు ఫ్యాన్స్ ఫిదా..!
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ బౌలర్ అర్షదీప్.. తన అద్భుత బౌలింగ్‌తో అనతి కాలంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ బౌలర్ అర్షదీప్.. తన అద్భుత బౌలింగ్‌తో అనతి కాలంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ టీమిండియాలో స్థానం స్థానం సుస్థిరం చేసుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న అర్షదీప్.. అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆసియా కప్‌లో భాగంగా పాక్, భారత్ తలపడినా ఓ మ్యాచ్‌లో అర్షదీప్ కీలక సమయంలో సునాయస క్యాచ్ మిస్ చేసి తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే.
అతడు క్యాచ్ మిస్ చేయడం వల్లే పాక్‌పై భారత్ ఓటమి పాలైందని సోషల్ మీడియా వేదికగా అర్షదీప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పాక్ నడ్డి విరిచాడు అర్షదీప్ సింగ్. తన తొలి ఓవర్‌లోనే అద్భుతమైన డెలివరీతో పాక్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ అజామ్‌ను ఔట్ చేసి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో మరికొన్ని కీలక వికెట్లు తీసిన సింగ్.. పాక్ తక్కువ స్కోర్‌కే చాపచుట్టేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో అర్షదీప్‌పై ప్రశంసలు కురిశాయి. ఆసియా కప్‌లో పాక్‌పై భారత్ ఓటమికి కారణమైన అర్షదీప్.. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసలు కురిపించారు. అయితే, అభిమానుల విమర్శలు, ప్రశంసలపై తాజాగా ఓ కార్యక్రమంలో అర్షదీప్ స్పందించాడు.
భారత్‌లో అభిమానులు క్రికెటర్లను ఎంతో ప్రేమతో ఆరాధిస్తారని.. క్రికెటర్లు బాగా ఆడితే ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారని పేర్కొన్నాడు. ఆటగాళ్లు బాగా ఆడినప్పడు పొగిడే ఫ్యాన్స్.. ప్లేయర్స్ విఫలమైనప్పడు తిడతారని.. ఫ్యాన్స్ ప్రశంసలను స్వీకరించినట్లే.. వారి విమర్శలను కూడా స్వీకరించాలని అన్నాడు. తమను ఎంతో అభిమానించే ఫ్యాన్స్‌కు మేము విఫలమైనప్పుడు తిట్టే హక్కు ఉంటుందని.. ఆ విమర్శలను కూడా స్వీకరించాల్సిన బాధ్యత తమపై ఉందని అర్షదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అర్షదీప్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వయస్సులో చిన్నవాడై అయినా.. అర్షదీప్ ఎంతో హుందాగా మాట్లాడాడు అని పొగుడుతున్నారు.