SA vs IND : ఎదురీదుతున్న దక్షిణాఫ్రికా.. 124/4
సౌతాఫ్రికా(South Africa) ఇండియా మధ్య (India) జరుగుతున్న మూడో టీ20లో 220పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 13ఓవర్లు ముగిసే సరికి 4వికెట్లు కోల్పోయి 124 పరుగులతో ఆడుతూ విజయం కోసం పోరాడుతోంది.
దిశ, వెబ్ డెస్క్ : సౌతాఫ్రికా(South Africa) ఇండియా మధ్య (India) జరుగుతున్న మూడో టీ20లో 220పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 13ఓవర్లు ముగిసే సరికి 4వికెట్లు కోల్పోయి 124 పరుగులతో ఆడుతూ విజయం కోసం పోరాడుతోంది. క్లాసన్ 29, మిల్లర్ 9పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర పటేల్, అర్షదీస్ సింగ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తిలక్ వర్మ(Tilak Verma ) దూకుడైన ఆటతో (107*: 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు) శతక సాధనతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ సూపర్ సెంచరీతో సౌతాఫ్రికా ముందు టీమిండియా భారీ లక్ష్యం ఉంచింది.
తిలక్ వర్మ 51 బంతుల్లో శతకం బాదాడు. టీ20ల్లో అతడికిదే తొలి సెంచరీ. ఓపెనర్ అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. హార్దిక్ పాండ్య (18), రమణ్ దీప్ సింగ్ (15) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమోలన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో యాన్సెస్ ఒక వికెట్ తీశారు.