WTC Final : డబ్ల్యూటీసీకి క్వాలిఫై.. భారత్ ముందున్న 4 చాన్స్‌లివే..!

పెర్త్ టెస్ట్‌లో 295 పరుగుల భారీ విజయం.. భారత్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకశాలను సజీవంగా ఉంచింది.

Update: 2024-12-02 09:25 GMT

దిశ, స్పోర్ట్స్ : పెర్త్ టెస్ట్‌లో 295 పరుగుల భారీ విజయం.. భారత్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ టాప్‌లోకి దూసుకురాగా.. ఆస్ట్రేలియా రెండో స్థానానికి పరిమితమైంది. శ్రీలంకపై విజయంతో సౌతాఫ్రికా రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసీ పాయింట్స్ పట్టికను ఫైనలైజ్ చేయనున్న నేపథ్యంలో తాజా సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంకలు పాయింట్ల పట్టి్కలో టాప్ 2 స్థానాలు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

భారత్ ఫైనల్ చేరాలంటే సమీకరణాలు ఇలా..

ఆస్ట్రేలియాను భారత్ 5-0, 4-1, 4-0 లేదా 3-0 తేడాతో ఓడిస్తే..

ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌పైన పేర్కొన మార్జిన్‌లతో విజయం సాధిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆసీస్ జట్టు టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

3-1తేడాతో ఆస్ట్రేలియాను ఓడిస్తే..

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌‌ను భారత్ 3-1తేడాతో ఆస్ట్రేలియాపై గెలిస్తే ఫైనల్ చేరుకుంటుంది. అయితే సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో శ్రీలంక గెలిస్తే భారత్‌కు లైన్ క్లియర్ కానుంది. ఒక వేళ ఈ మ్యాచ్ డ్రా అయిన భారత్ ఫైనల్ చేరుకుంటుంది.

భారత్ 3-2 తేడాతో ఆస్ట్రేలియాపై గెలిస్తే..

జనవరి 29 నుంచి ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్యలో జరగనున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌‌లో కనీసం ఒక మ్యాచ్‌ను శ్రీలంక డ్రాగా ముగిస్తే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.

భారత్ 2-2 తేడాతో సిరీస్ డ్రా చేసుకుంటే..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్‌కు చేరు చాన్స్ ఉంటుంది. కానీ, శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో శ్రీలంక ఆస్ట్రేలియాను 2-0 తేడాతో ఓడించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News