వార్నర్, కమ్మిన్స్ లేకపోయినా భారత్ ను ధీటుగా ఎదుర్కొంటాం: హ్యాండ్స్ కాంబ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండు టెస్ట్ లలో ఓటమిని చవిచూసింది. దీంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Update: 2023-02-26 15:00 GMT

దిశ, వెబ్ డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండు టెస్ట్ లలో ఓటమిని చవిచూసింది. దీంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. తన తల్లి అనారోగ్యం బారినపడడంతో ఆసిస్ సారథి కమ్మిన్స్ సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అదేవిధంగా ఢిల్లీ టెస్ట్ లో మోచేతి ఫ్రాక్చర్ మరియు కంకషన్ గురైన డేవిడ్ వార్నర్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి చోటును భర్తీ చేసేలా ఇన్నాళ్లు చేతి వేలి గాయంతో మొదటి రెండు టెస్ట్ లకు అందుబాటులో లేని కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ ఫుల్ ఫిట్ నెస్ తో మూడో టెస్ట్ ఆడేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ఆస్ర్టేలియా బ్యాటర్ హ్యాండ్స్ కాంబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండోర్‌లో బుధవారం ప్రారంభమయ్యే మూడో టెస్టులో డేవిడ్ వార్నర్, కమ్మిన్స్ లేకపోవడం బాధకరమేనని, కానీ వారి స్థానంలో కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ పూర్తిగా కొలుకొని తిరిగిరావడం జట్టుకు కొత్త ఉత్తేజాన్ని కలిగించే విషయమని హ్యాండ్స్ కాంబ్ తెలిపాడు. వార్నర్, కమ్మిన్స్ లేకపోయినా.. భారత్ ధీటుగా ఎదుర్కొంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. వారిద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొగల సత్తా వారిలో ఉందని హ్యాండ్ కాంబ్ తెలిపాడు. అదేవిధంగా స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ పెద్ద సమస్యమే కాదని, గతంలో అతను 2015 నుంచి 2018 వరకు ఆస్ర్టేలియా కెప్టెన్ వ్యవహరించి విషయం మర్చిపొవొద్దన్నాడు.

Tags:    

Similar News