ఇంగ్షీషులో మాట్లాడలేక పోతున్నాం.. విదేశీ కోచ్ లు వద్దు

విదేశీ కోచ్ లు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు పాకిస్థాన్ క్రికెటర్లు.

Update: 2024-08-09 15:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : విదేశీ కోచ్ లు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు పాకిస్థాన్ క్రికెటర్లు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ జట్టులోని ఆటగాళ్లు ఆటలో మరింత బాగా రాణించడానికి ఖర్చుకు వెనుకాడకుండా విదేశీ కోచ్ లతో శిక్షణ ఇప్పిస్తోంది. కాని ఆ ఆటగాళ్ల సమస్యలు వేరేలా ఉన్నాయని తెలుస్తోంది. విదేశీ కోచ్ లు మాట్లాడే ఇంగ్లీష్ మాకు అర్థం కావడం లేదని, కోచ్ గా విదేశీయులని నియమిస్తే ట్రాన్స్లేటర్ ను కూడ జాతీయ జట్టులో నియమించాలని బోర్డును ఆటగాళ్లు కోరుతున్నారు. పాక్ పేసర్ నసీమ్ షా విదేశీ కోచ్ విషయమై విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఇంగ్లీష్ వారికి అర్థమవుతుందో లేదో అనే భయంతో కోచ్ తో ఏం మాట్లాడలేక పోతున్నామని వివరించాడు. అంతేకాదు వారు మాట్లాడే వేగాన్ని మేము అందుకోలేక పోతున్నామని వాపోయాడు. విదేశీ కోచ్ లతో తమకు భాషా సమస్య ఉందని, మాతృభాషలో కమ్యూనికేట్ చేయడం వలన మా అనుమానాలు పూర్తిగా నివృత్తి చేసుకునే వీలుంటుందని అన్నాడు. ఒకవేళ కోచ్ ను విదేశీయులనే నియమిస్తే.. అనువాదకుణ్ణి తప్పకుండా నియమించాలని కోరాడు. దీనిపై పాకిస్థాన్ అభిమానులు దేశం పరువు తీస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      


Similar News