వినేష్ అనర్హత వేటు ఎఫెక్ట్.. రెజ్లింగ్ నియమాల్లో భారీ మార్పులు

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ అనర్హత వేటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Update: 2024-08-12 14:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ అనర్హత వేటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ విభాగం, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి రెజ్లర్ల బరువు కొలిచే నియమ నిబంధనల్లో మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మార్పులు అథ్లెట్ల భద్రత, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని సమాచారం. కాగా ఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో వినేష్ ఫొగాట్ మీద అనర్హత వేటు వేసింది ఒలంపిక్ కమిటీ. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఈ అనర్హత మీద పారిస్ కోర్టులో వినేష్ న్యాయ పోరాటం చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల్లోగా ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు రానుంది.  


Similar News