సెమీస్‌లో యుకీ బాంబ్రీ జోడీ పరాజయం

దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పోరాటం ముగిసింది.

Update: 2024-03-01 17:53 GMT

దిశ, స్పోర్ట్స్ : దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో యుకీ బాంబ్రీ-రాబిన్ హాస్‌(నెదర్లాండ్స్) జోడీ సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో యుకీ బాంబ్రీ జోడీ 3-6, 6-7(2-7) తేడాతో 2వ సీడ్ అస్టిన్ క్రాజిసెక్(అమెరికా)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) చేతిలో ఓడిపోయింది. ఐదు డబుల్ ఫౌల్ట్స్ చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్‌లో ప్రత్యర్థుల దూకుడు ముందు తేలిపోయిన యుకీ బాంబ్రీ జంట.. రెండో సెట్‌లో గట్టిపోటీనిచ్చింది. అయితే, టై బ్రేకర్‌‌లో నిరాశ తప్పలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ బోపన్న-ఎబ్డెన్ జోడీ క్వార్టర్స్‌లో వెనుదిరిగిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News