ఇంగ్లాండ్ లయన్స్ కోచింగ్ బృందంలోకి దినేశ్ కార్తీక్

భారత సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఇంగ్లాండ్ లయన్స్‌కు సేవలందించనున్నాడు. ఆ జట్టు కోచింగ్ బృందంలో చేరనున్నాడు.

Update: 2024-01-10 18:59 GMT

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ఈ నెల ఆఖర్లో మొదలుకానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి 29 మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ భారత్‌లో పర్యటించనుంది. భారత ‘ఏ’ జట్టుతో రెండో రోజుల వార్మప్ మ్యాచ్, మల్టీ డే మ్యాచ్ ఆడనుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్‌ల్లో భారత సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఇంగ్లాండ్ లయన్స్‌కు సేవలందించనున్నాడు. ఆ జట్టు కోచింగ్ బృందంలో చేరనున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌కు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వెల్లడించింది. హెడ్ కోచ్ నీల్ కిలీన్ నాయకత్వంలో గ్రేమ్ స్వాన్, ఇయాన్ బెల్‌లతో కలిసి కార్తీక్ పనిచేయనున్నాడు. 9 రోజులపాటు దినేశ్ కార్తీక్ ఇంగ్లాండ్ లయన్స్‌కు సేవలందిస్తాడని ఈసీబీ పేర్కొంది. కాగా, ఈ నెల 12, 13 తేదీల్లో వార్మప్ మ్యాచ్, 17 నుంచి 20 మధ్య మల్డీ డే మ్యాచ్ జరగనుంది. కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు సత్తాచాటుతుండటం, మరోవైపు, ఫామ్ లేమితో దినేశ్ కార్తీక్ భారత జట్టులో కోల్పోయాడు. చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. ఇప్పటికే కామెంటేటర్‌గా అవతారమెత్తిన అతను.. ఇప్పుడు కోచ్‌గా మారబోతున్నాడు. 

Tags:    

Similar News