న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో దీపక్ చాహర్ (54/ 34) పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చాహర్ క్రీజులో ఉంటే తప్పకుండా భారత్ విజయం సాధించేది. ఆ మ్యాచ్లో టీమిండియా జట్టు కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోవడంతో బ్యాటర్ దీపక్ చాహర్ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దుఖం కళ్లల్లో కనిపించడంతో అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి. దీనిపై చాహర్ కాబోయే భార్య జయ భరద్వాజ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
క్రికెట్లో గెలుపోటములు సహజమని, జట్టులో స్థానం దక్కనప్పుడు ఇంతకంటే బాధ కలుగుతుందని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించేందుకు మీరు ఎంతో శ్రమించారని, మీ పోరాటాన్ని చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉందని ఆమె రాసుకొచ్చారు. కాగా, సౌతాఫ్రికా విధించిన 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 284 పరుగులకే అలౌట్ కావడంతో 3 వన్డేల సిరీస్ను సఫారీ జట్టు 3-0 గెలుచుకుంది.