దీప్తి శర్మ ఒంటరి పోరాటం.. యూపీని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు

Update: 2024-03-08 15:47 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు ఢిల్లీ ముందు 139 పరుగుల టార్గెట్ పెట్టింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఆ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో యూపీ 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటడంతో జట్టు ఆ స్కోరైనా సాధించింది. మిగతా బ్యాటర్లు దారుణంగా నిరాశపరిచారు. ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో దీప్తి శర్మ ఒంటరి పోరాటం చేసింది. జట్టును ఆదుకునేందుకు చివరి వరకూ పోరాడింది. ఆఖరి ఓవర్‌లో శిఖా పాండే బౌలింగ్‌లో దీప్తి క్యాచ్ అవుటై వెనుదిరిగింది. ఢిల్లీ బౌలర్లలో టిటాస్ సాదు, రాధా యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జొనాస్సెన్, ఎలీస్ క్యాప్సే చెరో వికెట్ తీశారు. 

Tags:    

Similar News