చితక్కొట్టిన రోడ్రిగ్స్, లానింగ్.. ముంబై ముందు భారీ టార్గెట్ పెట్టిన ఢిల్లీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగారు.

Update: 2024-03-05 15:54 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగారు. జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ మెగ్ లానింగ్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవడంతో ముంబై ముందు ఢిల్లీ జట్టు 193 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ ముందుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్(53), షెఫాలీ వర్మ(28) జట్టుకు అదిరిపోయే శుభారంభం అందించారు. దూకుడుగా ఆడే క్రమంలో షెఫాలీ వర్మ అవుటైనా లానింగ్ మాత్రం రెచ్చిపోయింది. ఆ తర్వాత ఆమెకు జెమీమా రోడ్రిగ్స్ తోడైంది. వీరిద్దరూ కాసేపు బౌండరీలతో అలరించారు. హాఫ్ సెంచరీ తర్వాత లానింగ్ పెవిలియన్ చేరగా.. జెమీమా రోడిగ్స్ అదే దూకుడును కొనసాగించింది. ముంబై బౌలర్లను ఊచకోత కోసింది. 33 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, పూజ వస్త్రాకర్, హేలీ మాథ్యూస్‌ చెరో వికెట్ పడగొట్టారు. 

Tags:    

Similar News