Dansuh Gunathilaka Rape Case: రేప్ కేసు.. నిర్దోషిగా బయటకొచ్చిన శ్రీలంక క్రికెటర్..

అత్యాచారయత్న ఆరోపణల కేసులో క్రికెట్‌కు దూరమైన శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలకకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.

Update: 2023-09-28 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: అత్యాచారయత్న ఆరోపణల కేసులో క్రికెట్‌కు దూరమైన శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలకకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అతడు.. తాజాగా నిర్దోషిగా తేలాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్‌ సమయంలో ఆస్ట్రేలియా మహిళపై అతడు అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో ఆసీస్ పోలీసు అధికారులు అతడిని అరెస్ట్‌ చేశారు. అయితే తాజాగా ఆ అత్యాచారయత్న ఆరోపణలను కొట్టి పారేస్తూ తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా కేసు నుంచి గుణతిలక నిర్దోషిగా బయటపట్టాడు. శ్రీలంక తరఫున వందకు పైగా ఇంటర్నేషనల్​మ్యాచ్‌లు ఆడిన గుణతిలక.. అత్యాచార ఆరోపణలలలో అరెస్ట్​అయిన నేపథ్యంలో అతడి సస్పెండ్‌ చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అతడు నిర్దోషిగా తేలడంతో తిరిగి జాతీయ జట్టులోకి అతడు వెళ్లే అవకాశముంది.

అసలు జరిగిందంటే.. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్‌ గుణతిలకను గతేడాది నవంబర్‌లో సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు. 'గుణతిలకకు కొంతకాలం క్రితం ఆన్‌లైన్‌ వేదికగా 29 ఏళ్ల మహిళ పరిచయమైంది. వీరిద్దరూ నవంబర్‌ 2న రోజ్‌ బే లోని ఓ హెటల్‌ గదిలో మీట్ అయ్యారు. అనంతరం ఆమెపై అతడు అత్యాచారానికి ప్రయత్నించాడు' అని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Similar News