CWC Qualifiers 2023: జింబాబ్వేపై నెదర్లాండ్స్‌ భారీ స్కోర్‌..

CWC Qualifiers 2023లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ భారీ స్కోర్‌ చేసింది.

Update: 2023-06-20 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifiers 2023లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ భారీ స్కోర్‌ చేసింది. నెదర్లాండ్స్‌ బ్యాటర్స్‌లో.. ఓపెనర్లు విక్రమ్‌జిత్‌ సింగ్‌ (88), మ్యాక్స్‌ ఒడౌడ్‌ (59), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (83), ఆఖరిలో సకీబ్‌ జుల్ఫికర్‌ (34 నాటౌట్‌) చెలరేగడంతో నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు స్కోర్‌ చేసింది. జింబాబ్వే బౌలర్లలో.. సికందర్‌ రజా (4), రిచర్డ్‌ నగరవ (2) తీశారు.

మరో మ్యాచ్‌లో.. యూఎస్‌ఏ-నేపాల్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ.. 49 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. యూఎస్‌ఏ బ్యాటర్స్‌లో.. వికెట్‌ కీపర్‌ షయాన్‌ జహంగీర్‌ (79 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో యూఎస్‌ఏను ఆదుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో జహంగీర్‌కు సుశాంత్‌ మొదానీ (42), గజానంద్‌ సింగ్‌ (26) పరుగులతో రాణించారు. నేపాల్‌ బౌలర్లలో.. కరణ్‌ 4, గుల్షన్‌ షా 3, దీపేంద్ర సింగ్‌ 2, లలిత్‌ రాజబంశీ 1 వికెట్‌ తీశారు.


Similar News