క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి కన్నుమూత
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్(74) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తిలక్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయినా కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని అతని ఇంటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తిలక్‌యాదవ్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.