Mahika Gaur: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అరుదైన ఘనత.. తొలి మహిళా క్రికెటర్‌‌గా..

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ మహికా గౌర్ చరిత్ర సృష్టించింది.

Update: 2023-09-01 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ మహికా గౌర్ చరిత్ర సృష్టించింది. రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. తాజాగా ఇంగ్లాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్‌లో జన్మించిన మహికా గౌర్.. ఫ్యామిలీ దుబాయికి వెళ్లడంతో 13 ఏళ్లకే యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.

2019లో యూఏఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మహికాకు వచ్చింది. దాదాపు మూడేళ్లపాటు యూఏఈ తరఫున ఆడగా.. ఆ జట్టు తరఫున 19 టీ20లు ఆడిన మహికా 9 వికెట్లు పడగొట్టింది. యూఏఈ తరఫున 2023 అండర్-19 ప్రపంచకప్‌లోనూ పాల్గొంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌-A స్క్వాడ్‌కు ఎంపికైంది. ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టులోకి అడుగు పెట్టింది. దీంతో రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డును తన ఖాతాలో వేసుకుంది.


Similar News