Paris olympics : ఆ రేంజ్లో ప్రపోజ్ చేశాక ఒప్పుకోకుండా ఉంటుందా?.. పారిస్ వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
పారిస్ ఒలింపిక్స్ వేదికగా ఓ ప్రేమ జంట ఒక్కటైంది.
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ వేదికగా ఓ ప్రేమ జంట ఒక్కటైంది. చైనా షట్లర్లు హువాంగ్ యాకియాంగ్, లీ యుచెన్ ప్రేమకు పారిస్ విశ్వక్రీడలు సాక్ష్యంగా నిలిచాయి. అసలేం జరిగిందంటే.. మిక్స్డ్ డబుల్స్‌లో జెంగ్ సీ వీతో కలిసి యువాంగ్ యాకింగ్ స్వర్ణ పతకం గెలిచింది. ఆమెకు ఒలింపిక్స్‌లో ఇదే తొలి గోల్డ్ మెడల్. మెడల్ సెర్మనీ పూర్తయిన కాసేపటికే ఆమెకు మరో సర్ప్రైజ్.
చైనా బృందంలోని మరో షట్లర్ లీ యుచెన్ లవ్ ప్రపోజ్ చేశాడు. అభిమానుల మధ్య యుచెన్ మోకాళ్లపై కూర్చుని హువాంగ్‌కు తన ప్రేమను వ్యక్తం చేశాడు. హువాంగ్ సిగ్గుపడుతూ యుచెన్ ప్రేమను అంగీకరించింది. దీంతో యుచెన్ రింగ్ తొడిగి ఆమెకు కౌగిలించుకున్నాడు. దీంతో అభిమానులు కేరింతలతో ఆ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా హువాంగ్‌కు పారిస్ ఒలింపిక్స్ మర్చిపోలని జ్ఞాపకంగా మిగిలిపోనుంది.