China Open: చైనా ఓపెన్ విజేతగా కార్లోస్ అల్కరాస్..

చైనా ఓపెన్(China Open) ఏటీపీ 500(ATP 500) టోర్నీ పురుషుల సింగిల్స్ ఛాంపియన్(Men's Singles Champion)గా స్పెయిన్(Spain) స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్(Carlos Alcaraz) నిలిచాడు.

Update: 2024-10-02 17:32 GMT

దిశ, వెబ్‌డెస్క్:చైనా ఓపెన్(China Open) ఏటీపీ 500(ATP 500) టోర్నీ పురుషుల సింగిల్స్ ఛాంపియన్(Men's Singles Champion)గా స్పెయిన్(Spain) స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్(Carlos Alcaraz) నిలిచాడు.ఈరోజు బీజింగ్‌(Beijing) వేదికగా జరిగిన సింగిల్స్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ వన్,ఇటలీ(Itali)కి చెందిన జనిక్ సిన్నర్‌(Jannik Sinner)పై 6-7(6),6-4,7-6(3) తేడాతో విజయం సాధించాడు.దాదాపు మూడు గంటల ఇరవై ఒకటి నిమిషాల పాటు జరిగిన తుది పోరులో ఇద్దరు ఆటగాళ్లు నువ్వా నేను అన్నట్లు తలపడ్డారు.తొలి సెట్‌ను సిన్నర్ 7-6తో గెలుచుకోగా, రెండో సెట్‌ను 6-4తో అర్కారాస్ గెలుచుకున్నాడు.ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చివరికి టై బ్రేకర్‌లో అల్కరాజ్ 7-6తో మూడో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో తన కెరీర్లో తొలిసారి చైనా ఓపెన్ టైటిల్(China Open Title)ను గెలుచుకున్నాడు.కాగా ఇటీవల పారిస్(Paris) వేదికగా జరిగిన ఒలింపిక్స్(Olympics) క్రీడలలో కార్లోస్ అల్కరాస్ వెండి(silver) పతకం సాధించిన విషయం తెలిసిందే. 


Similar News