Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్.. ధోనీ కుమార్తే రియాక్షన్ చూశారా..? వీడియో వైరల్

చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ముగించింది.

Update: 2023-08-24 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ముగించింది. చందమామ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ప్రముఖ క్రికెటర్లు చంద్రయాన్ విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రయాన్ మిషన్ ప్రోగ్రెస్‌ను టీవీలో చూసిన ధోనీ.. సహచరులతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఈ వీడియోలో ట్యాంక్ టాప్, షార్ట్స్ వేసుకొని ఉన్న ధోనీ.. చంద్రయాన్ విజయాన్ని ఆనందించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ధోనీని అందుకే కెప్టెన్ కూల్ అని పిలుస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇన్‌స్టా హ్యాండిల్‌లో మరో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా చంద్రయాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించింది. టీవీలో ఆ వార్త చూస్తూ ఆమె సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Similar News