అనూహ్య ఓటమి.. కోపంతో రాకెట్‌ను విరగొట్టిన అల్కరాజ్

పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ ప్రవర్తన చర్చనీయాంశమైంది.

Update: 2024-08-17 17:30 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ ప్రవర్తన చర్చనీయాంశమైంది. అనూహ్య ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అతను సహనం కోల్పోయి తన రాకెట్‌ను విరగొట్టాడు. అమెరికా వేదికగా జరుగుతున్న సిన్సినాటి ఓపెన్‌లో 2వ సీడ్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్‌కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో అల్కరాజ్‌ 6-4, 6-7(5-7), 4-6 తేడాతో అన్‌సీడ్ ప్లేయర్, ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్ఫిల్స్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేసిన అతను మిగతా రెండు సెట్లను కోల్పోయి మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు.

అయితే, అనూహ్య ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అల్కరాజ్ కోపంతో ఊగిపోయాడు. కోర్టులోనే తన రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. రాకెట్ విరిగిపోయే వరకు కొట్టాడు. అల్కరాజ్ చర్యతో అభిమానులకు షాక్‌కు గురయ్యారు. తన ప్రవర్తన పట్ల అల్కరాజ్ శనివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ‘నా ప్రవర్తనపై క్షమాపణలు చెబుతున్నా. అలా మంది కాదు. అందులోనూ కోర్టులో అలా చేసి ఉండకూడదు. నేను మనిషినే. కొన్నిసార్లు భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టం. మళ్లీ అలా జరగకుండా చూసుకుంటా.’అని రాసుకొచ్చాడు. 

Tags:    

Similar News