న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో మొదటిసారిగా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్సీ బాధ్యతల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విరాట్, ధోనీ తనకంటే ముందుగా ఈ పాత్రను పొందడం న్యాయమేనని అంగీకరించాడు. జాతీయ జట్టు కెప్టెన్సీ పొందడానికి అనువైన సమయం 26-27 ఏళ్లని అభిప్రాయపడ్డ రోహిత్.. కోరుకున్నది పొందడం ఎప్పుడూ సాధ్యం కాదన్నాడు. ‘నా కంటే ముందు విరాట్, ధోనీ కెప్టెన్లుగా సేవలందించారు. కానీ భారత జట్టులోని మరికొందరు దిగ్గజాలకు జాతీయ జట్టుకు పూర్తిస్థాయిలో కెప్టెన్‌గా ఉండలేకపోయారంటూ పలువురి పేర్లను ప్రస్తావించాడు.
గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్.. వీరంతా భారత క్రికెట్‌లో దిగ్గజాలు. యువరాజ్ భారత్‌కు మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు, అయినా ఎప్పుడూ కెప్టెన్‌గా వ్యవహరించలేదు. నిజానికి అతను ఏదో ఒక దశలో కెప్టెన్‌గా ఉండాల్సింది. కానీ ఆ అవకాశం దక్కలేదు. అదే జీవితం. నేను ఇప్పుడు ఆ అవకాశాన్ని పొందినందుకు కృతజ్ఞుడను. కెప్టెన్సీ గురించి ABCD తెలియనప్పుడు కాకుండా జట్టుకు కెప్టెన్‌గా ఎలా వ్యవహరించాలో తెలిసినప్పుడే ఈ అవకాశం వరించింది. కాబట్టి నా విషయంలో ఇదే మంచిది’ అని పేర్కొన్నాడు.
Also Read: ఫ్రెండ్లీ రిక్వెస్ట్.. వరల్డ్ కప్ టికెట్లను నన్ను అడగవద్దు : Virat Kohli