బుమ్రా.. నా సర్వర్ ను అడ్డుకోగలడా? సైనా ఆసక్తికర వ్యాఖ్యలు

ఒలింపిక్ పతక విజేత, భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ రఘువంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

Update: 2024-08-09 14:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒలింపిక్ పతక విజేత, భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ రఘువంశీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. శుక్రవారం( ఆగస్టు 9) జరిగిన ఓ పోడ్ కాస్ట్ షో లో శుభంకర్ మిశ్రాతో మాట్లాడుతూ.. తనపై యువ బ్యాటర్ రఘువంశీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. "కొన్నిసార్లు క్రికెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంటుంది. బాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్ లాంటి ఆటలు.. శారీరకంగా చాలా కఠినమైనవి.మీకు షటిల్ లో సర్వ్ చేయడానికి కూడా టైం ఉండదు. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది" అని సైనా నెహ్వాల్ అన్నారు. అయితే కేకేఆర్ యువ ప్లేయర్ రఘువంశీ.. "బుమ్రా 150 కి.మీ వేగంతో బౌన్సర్ వేస్తే సైనా ఎలా ఆడుతుందో" అని తన X ఖాతాలో తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా "ఎవరూ చచ్చిపోవడానికే క్రికెట్ ఆడరు. బుమ్రాతో నేనెందుకు క్రికెట్ ఆడాలి? ఒకవేళ బుమ్రా నాతో బ్యాడ్మింటన్ ఆడితే.. నా సర్వీస్ ను కూడా అందుకోలేడు, అది 300 కి.మీ వేగం కావచ్చు, ఇంకెంతైనా కావచ్చు" అని సైనా అన్నారు. అయితే కేకేఆర్ ప్లేయర్ రఘువంశీ.. తను చేసిన వ్యాఖ్యలకు వెంటనే "సైనా నెహ్వాల్" ను క్షమాపణలు కోరాడు. 


Similar News