Budget 2024 : క్రీడలకు రూ. 3,442 కోట్లు.. ఖోలో ఇండియాకు అత్యధికంగా
లోక్‌సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టారు.
దిశ, స్పోర్ట్స్ : లోక్‌సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ. 3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం(రూ. 3,396.96 కోట్లు)తో పోలిస్తే అదనంగా రూ. 45.36 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. వచ్చే రెండేళ్లలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు ఉండటంతో క్రీడా బడ్జెట్‌ను స్వల్పంగా పెంచినట్టు తెలుస్తోంది. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేలో ఇండియా ప్రొగ్రామ్‌కు అత్యధికంగా కేటాయింపులు దక్కాయి. ఖేలో ఇండియాకు రూ. 900 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)కు రూ. 822.60 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ. 26.83 కోట్లు అదనం. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లకు రూ. 15 కోట్లు పెంచి రూ. 340 కోట్లు కేటాయించారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(రూ. 22.30 కోట్లు), నేషనల్ డోపింగ్ టెస్టింగ్ లాబోరేటరీ(రూ. 22 కోట్లు)ల కేటాయింపులను స్వల్పంగా పెంచారు.