బుడాపెస్ట్ రెజ్లింగ్ టోర్నీలో రజతం సాధించిన రీతిక

బుడాపెస్ట్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌లో భారత మహిళా రెజ్లర్ రీతిక హుడా రజతం గెలుచుకుంది.

Update: 2024-06-09 14:30 GMT

దిశ, స్పోర్ట్స్ : హంగేరీలో జరుగుతున్న బుడాపెస్ట్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌లో భారత మహిళా రెజ్లర్ రీతిక హుడా రజతం గెలుచుకుంది. మహిళల 76 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఆమె నాలుగు రౌండ్లలో మూడింట నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. 76 కేజీల కేటగిరీని నోర్డిక్ సిస్టమ్ పద్ధతిలో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించారు. తొలి బౌట్‌లో రీతిక 8-0 తేడాతో మాజీ వరల్డ్ చాంపియన్ జస్టినా డి స్టాసియో(కెనడా) ఓడించింది. ఆ తర్వాత మూడో రౌండ్‌లో 2-3 తేడాతో టటియానా రెంటెరియా(కొలంబియా) చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత పుంజుకున్న రీతిక నాలుగో రౌండ్‌లో 7-0 తేడాతో జానెబ్ స్ఘైయర్(ట్యునీషియా)పై, ఫైనల్ రౌండ్‌లో 4-0 తేడాతో జెనెసిస్ రియాస్కో వాల్డెజ్(ఈక్వెడార్)ను చిత్తు చేసి రజతం సాధించింది. దీంతో భారత్ ఈ టోర్నీని నాలుగు పతకాలతో ముగించింది. ఈ టోర్నీలో అమన్(పురుషుల 57 కేజీలు), అంతిమ్ పంఘల్(మహిళల 53 కేజీలు), అన్షు మాలిక్(57 కేజీలు) సిల్వర్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. 


Similar News