పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్‌కు అడుగు దూరంలో బాక్సర్ జైస్మిన్

భారత మహిళా బాక్సర్ జైస్మిన్ పారిస్ ఒలింపిక్స్‌ కోటాకు అడుగు దూరంలో నిలిచింది.

Update: 2024-06-01 17:18 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా బాక్సర్ జైస్మిన్ పారిస్ ఒలింపిక్స్‌ కోటాకు అడుగు దూరంలో నిలిచింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫికేషన్ టోర్నీలో ఆమె 57 కేజీల కేటగిరీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగిన రెండో రౌండ్‌లో జైస్మిన్ 5-0 తేడాతో స్విట్జర్లాండ్‌కు చెందిన అనా మిలిసిక్‌ను చిత్తు చేసింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె ఏకపక్షంగా బౌట్‌ను గెలుచుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె మాలి బాక్సర్ మెరైనా కమరాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే జైస్మిన్ ఒలింపిక్స్‌ బెర్త్‌ను సాధించడం ఖాయమే. మరోవైపు, పురుషుల 57 కేజీల కేటగిరీలో సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయాడు. ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్లో పాలమ్ చేతిలో 5-0 తేడాతో పరాజయం పాలయ్యాడు. అయితే, ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు సచిన్‌కు మరో అవకాశం ఉంది. కోటా బౌట్‌లో గెలవడం ద్వారా అతను బెర్త్ సాధించొచ్చు. 


Similar News