Olympics2024: ఒలంపిక్స్‌లో పాల్గొంటున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఇప్పటికే రెండుసార్లు పతకాలు

పారిస్ వేదికగా ఒలంపిక్స్ గేమ్స్-2024 అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ తరపున మొత్తం 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.

Update: 2024-07-27 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ వేదికగా ఒలంపిక్స్ గేమ్స్-2024 అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ తరపున మొత్తం 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. గ‌తంలో కంటే ఈ సారి ఎక్కువ మెడ‌ల్స్‌ను గెలుచుకుంటామ‌ని భార‌త్ భావిస్తోంది. ఇక తెలంగాణ‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ బ‌రిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా క్రీడల్లో పోలీసులు, రైల్వే ఉద్యోగులు పాల్గొంటారు. కానీ ఈసారి అనూహ్యంగా ఓ ఎమ్మెల్యే ఒలంపిక్స్‌లో పాల్గొంటున్నారు. బిహార్ రాష్ట్రం నుంచి ఒక్కరు మాత్రమే దేశానికి ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆ ఒక్క అథ్లెట్ బీజేపీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ కావడం విశేషం. కాగా, ఇప్పటికే ఆమె 2014లో కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా షూటింగ్వ విభాగంలో రజతం, 2018లో స్వర్ణ పతకం సాధించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన ఆమె 2020లో జముయ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి గెలుపొందారు.



 


Tags:    

Similar News