బిల్లీ జీన్ కింగ్ కప్‌లో భారత్ జోరు
బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టెన్నిస్ టోర్నీలో ప్లే ఆఫ్స్‌కు భారత జట్టు అడుగు దూరంలో నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టెన్నిస్ టోర్నీలో ప్లే ఆఫ్స్‌కు భారత జట్టు అడుగు దూరంలో నిలిచింది. ఆసియా/ఒషియానియా గ్రూపు-1లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ కొరియాపై 1-2 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూపులో రెండో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్‌లో రుతుజ 6-2, 6-2 తేడాతో సోహ్యున్ పార్క్‌పై నెగ్గి జట్టుకు శుభారంభం అందించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో అంకిత రైనా 2-6, 3-6 తేడాతో సుజియోంగ్ జంగ్ చేతిలో ఓడటంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా-ప్రార్థన జోడీ 6-4, 6-4 తేడాతో డాబిన్ కిమ్- సోహ్యున్ పార్క్ జోడీని ఓడించడంతో భారత్ విజయం లాంఛనమైంది. శనివారం చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుంది.