‘భారత్’.. ఇది వినడానికి బాగుంది : Sunil Gavaskar

కేంద్రం ‘ఇండియా’ పేరును ఆంగ్లంలో ‘భారత్‌’గా మార్చబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Update: 2023-09-06 10:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ‘ఇండియా’ పేరును ఆంగ్లంలో ‘భారత్‌’గా మార్చబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ ‘భారత్’ అంశంపై స్పందించారు. ‘‘మన దేశం అసలు పేరు ‘భారత్’. ఇది వినడానికి కూడా బాగుంది. కానీ, దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్‌ టీమ్‌’ అని పిలవాలి. ఇది వరకు కూడా దేశాల పేర్లలో మార్పులు జరిగాయి. బర్మాను ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తున్నారు. కాబట్టి మన దేశం కూడా అసలు పేరుకు మారొచ్చు. దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ, ఇది అన్నిస్థాయిల్లో మారాల్సి ఉంటుంది’’ అని సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.


Similar News