బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే టెస్ట్ గెలిచి చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టు చరిత్రలో బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ లేకుండానే మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. స్టోక్స్ కేవలం ఒక క్యాచ్ మాత్రమే పట్టాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ మొదట్లో.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు.. 56.2 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 524 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఐర్లాండ్ జట్టు.. 86.2 ఓవర్లకు 362 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కేవలం 11 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఒలీ పోప్ 208 బంతుల్లో 205 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
Read More: రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. అదే చివరి సిరీస్