టీమ్‌ ఇండియాను భారత్‌లో ఓడించడం అసాధ్యం: Shoaib Akhtar

భారత్ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రారంభంకానుంది.

Update: 2023-09-09 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ టైటిల్‌ ఫేవరెట్లలో పాకిస్థాన్‌ కూడా ఒకటని పాక్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. అయితే, పాక్‌ జట్టులో స్పిన్‌ విభాగం బలహీనంగా ఉందని, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. టీమ్‌ ఇండియాను భారత్‌లో ఓడించడం అసాధ్యమని పేర్కొన్నాడు.

‘‘పాకిస్థాన్ స్పిన్‌ విభాగం బలహీనంగా ఉంది. షాదాబ్ ఖాన్ మంచి బౌలరే. జట్టులో స్పిన్‌ బౌలింగ్‌ చేయగలిగిన ఆల్‌రౌండర్ లేడు. రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో పాక్‌ ఒకటి. ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్‌ ఫేవరెటే. నిజాయితీగా చెప్పాలంటే.. భారత్‌ను భారత్‌లో ఓడించడం దాదాపు అసాధ్యం.అయితే, భారత్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం కూడా అంతే. ఎందుకంటే రెండు జట్లలో మంచి పేస్ బౌలర్లు ఉన్నారు. టీమ్‌ ఇండియా స్పిన్‌ విభాగం కూడా బలంగా ఉంది. పాకిస్థాన్‌ బ్యాటింగ్ గతంలో బలహీనంగా ఉండేది. ఇప్పుడు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో పటిష్టంగా ఉంది. వారిని ఔట్ చేయడం అంత తేలికైన విషయం కాదు’’ అని షోయబ్‌ అక్తర్‌ తెలిపారు.


Similar News