ఐపీఎల్ తరహాలో మరో టోర్నీని ప్లాన్ చేస్తున్న బీసీసీఐ

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-13 13:20 GMT

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీలు విజయవంతమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్లు బీసీసీఐకి కీలక విజ్ఞప్తి చేశారు. సొంత లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించాలని సెక్రెటరీ జై షాను కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘మాజీ క్రికెటర్ల నుంచి మాకు ప్రతిపాదన వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నాం. అయితే, ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది.’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

ఐపీఎల్ తరహాలో ఈ లీగ్‌ను నిర్వహించాలని మాజీ క్రికెటర్లు కోరినట్టు సమాచారం. ప్లేయర్ల వేలంతోపాటు సిటీ ఆధారిత ఫ్రాంచైజీలు కలిగి ఉండాలని జై షాను కోరినట్టు తెలుస్తోంది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ విజయవంతం అవడంతో బీసీసీఐ కూడా సొంత లెజెండ్స్ లీగ్‌పై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే బీసీసీఐ వచ్చే ఏడాది లీగ్‌ను నిర్వహించనున్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News