BCCI : ఆరుగురు హైదరాబాద్ క్రికెటర్లపై బీసీసీఐ రెండేళ్ల నిషేధం
ఆరుగురు హైదరాబాద్ క్రికెటర్ల( Six Hyderabad cricketers) పై నిషేధం(Bans)విధిస్తూ బీసీసీఐ(BCCI)సంచలన నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : ఆరుగురు హైదరాబాద్ క్రికెటర్ల( Six Hyderabad cricketers) పై నిషేధం(Bans)విధిస్తూ బీసీసీఐ(BCCI)సంచలన నిర్ణయం తీసుకుంది. అండర్ - 19 క్రికెట్ లో వయసు తక్కువగా చూపినట్లుగా విచారణలో తేలడంతో వారిపై రెండేళ్ల నిషేధం విధించింది. వయసు దృవీకరణలో వారు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి మోసపూరితంగా వ్యవహరించారని గుర్తించారు. ఈ మోసానికి పాల్పడిన వారిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే అవినీతి కుంభకోణాల్లో పలు విచారణలు ఎదుర్కోంటున్న హెచ్ సీఏ కు యువ క్రికెటర్ల నిషేధం వ్యవహారం మరింత మచ్చ తెచ్చినట్లయ్యంది.