ఈ నెల 29న బీసీసీఐ మీటింగ్.. కొత్త సెక్రెటరీని ఎన్నుకుంటారా?

ఈ నెల 29న బెంగళూరు వేదికగా బీసీసీఐ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) జరగనుంది.

Update: 2024-09-05 12:30 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 29న బెంగళూరు వేదికగా బీసీసీఐ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) జరగనుంది. మీటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని బోర్డు గురువారం రాష్ట్ర అసోసియేషన్లకు తెలియజేసింది. సమావేశంలో 18 అంశాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మీటింగ్‌లో జై షా బీసీసీఐ సెక్రెటరీగా రాజీనామా చేయనున్నారు. అయితే, జై షా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, కొత్త సెక్రెటరీ గురించి ఎజెండా అంశాల్లో లేకపోవడం గమనార్హం. అందు కోసం స్పెషల్ జనరల్ మీటింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఐసీసీ‌లో బీసీసీఐ ప్రతినిధిగా జై షా ఉన్నారు. ఆయన ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవడంతో ఆ రోల్ నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో వార్షిక సమావేశంలో ఐసీసీలో కొత్తి ప్రతినిధిని నియమించనున్నారు. అలాగే, బడ్జెట్ ఆమోదంతోపాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో జనరల్ బాడీకి ఇద్దరు ప్రతినిధులను, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ నుంచి ఒకరిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు నియమించనున్నారు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అఫీసర్‌ నియామకాలతోపాటు క్రికెట్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, అంపైర్స్ కమిటీలపై చర్చంచనున్నారు. 

Tags:    

Similar News