Asia Cup 2023, BAN Vs SL: శ్రీలంకతో బంగ్లా ఢీ.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్

ఆసియాకప్‌-2023లో భాగంగా క్యాండీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది.

Update: 2023-08-31 10:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్‌-2023లో భాగంగా క్యాండీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభానికి ముందు ఆతిథ్య శ్రీలంక వరుస షాక్‌లు తగిలాయి. దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, వనిందు హసరంగ, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్‌ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. బ్యాటింగ్‌ పరంగా లంక పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పేలవంగా ఉంది.

బంగ్లాదేశ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బంగ్లా జట్టు తమ ఆఖరి రెండు వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌.. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లా జట్టుకు బిగ్‌షాక్‌ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ వైరల్‌ ఫీవర్‌ కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో అనముల్‌ హక్‌కు అవకాశం ఇచ్చారు.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):

మహ్మద్ నయీమ్, తాంజిద్ హసన్ (అరంగేట్రం), నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (సి), ముష్ఫికర్ రహీమ్ (WK), మెహిదీ హసన్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, మరియు ముస్తాఫిజుర్ రెహమాన్.

శ్రీలంక (ప్లేయింగ్ XI):

పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (WK), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దాసున్ షనక (సి), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మరియు మతీషా పతిరణ.

Tags:    

Similar News