బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రాజీనామా

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్(బీసీబీ) నజ్ముల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2024-01-13 08:46 GMT

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్(బీసీబీ) నజ్ముల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. అనంతరం యువజన, క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే బీసీబీ చైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. రెండు పదవులను ఒకేసారి చేపట్టేందుకు అవకాశమున్నా.. నజ్ముల్ బీసీబీ పదవిని వదులుకున్నాడు. రెండింటిపై దృష్టి సారించడం కష్టమవుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హసన్ వెల్లడించారు. మంత్రివర్గ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. నజ్ముల్ 2012 నుంచి బీసీబీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తదుపరి బీసీబీ ఎన్నికలు అక్టోబర్ 2025లో జరగనున్నాయి. దీంతో నజ్ముల్ తక్షణమే వైదొలిగితే, బీసీబీలోని ప్రస్తుత డైరెక్టర్ తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News