బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్ ముందు రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్

2023 వన్డే వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ప్రపంచ కప్ కు ఇంకా కొద్ది నెలలు మాత్రమే ఉన్న తరుణంలో.

Update: 2023-07-06 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023 వన్డే వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ప్రపంచ కప్‌కు ఇంకా కొద్ది నెలలు మాత్రమే ఉన్న తరుణంలో.. బంగ్లాదేశ్ ODI కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అతను గురువారం విలేకరులను అత్యవసర సమావేశానికి పిలిచి తన పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి ODIలో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఓడిపోయిన ఒక రోజు తర్వాత తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు.

ఈ సందర్భంగా తమీమ్ మాట్లాడుతూ.. “ఇది నాకు ముగింపు. నా బెస్ట్ ఇచ్చాను. నేను నా వంతు ప్రయత్నం చేసాను. ఈ క్షణం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అని అన్నారు. అలాగే. “నా సుదీర్ఘ ప్రయాణంలో నాతో పాటు ఉన్న నా సహచరులు, కోచ్‌లు, బీసీబీ అధికారులు, నా కుటుంబ సభ్యులు, నాతో పాటు ఉన్న వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. వారు నాపై నమ్మకం ఉంచారు. అలాగే “నేను అభిమానులకు కూడా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నాపై మీ ప్రేమ, విశ్వాసం బంగ్లాదేశ్‌కు నా అత్యుత్తమమైనదాన్ని అందించడానికి నన్ను ప్రేరేపించాయి. నా జీవితంలోని తదుపరి అధ్యాయం కోసం నేను మీ ప్రార్థనలను కోరాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మీ ప్రార్థనల్లో ఉంచుకోండి" అని తమీమ్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News