భారత్ వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్న ప్రపంచ ఆల్ రౌండర్

ప్రపంచ క్రికెట్ లో అన్ని ఫార్మట్లలో ఉత్తమ ఆల్ రౌండర్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ నిలిచాడు.

Update: 2024-09-26 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్ లో అన్ని ఫార్మట్లలో ఉత్తమ ఆల్ రౌండర్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ నిలిచాడు. ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించిన షకీబ్, ఐపీఎల్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. కాగా ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ నడుస్తోంది. శుక్రవారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ రోజు కాన్పూర్ విలేకరుల సమావేశంలో ఆల్ రౌండర్ షకీబ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇప్పటికే ప్రపంచ కప్ 2024 తన చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని, అక్టోబర్ లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ తర్వాత అతను రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే వన్డే క్రికెట్ లో కొనసాగడంపై స్పందిస్తూ.. పాకిస్థాన్‌లో జరిగే తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఆడాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

సౌతాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ఆడేందుకు తన ప్లాన్ గురించి అడిగిన ప్రశ్నకు షకీబ్ సమాధానమిస్తూ..నేను సిరీస్‌కి అందుబాటులో ఉన్నాను. దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా.. ప్రతిదీ నాపై ఆధారపడదు. ఈ విషయమై బీసీబీతో చర్చించాను. నా ప్రణాళికలను వారితో పంచుకున్నాను. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో ఈ సిరీస్‌తో పాటు స్వదేశంలో జరిగే సిరీస్‌లే నా చివరి సిరీస్‌గా భావిస్తున్నాను అని చెప్పాడు. అలాగే ఏదైనా పగతో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు, షకీబ్ మాట్లాడుతూ.. కొత్తవారికి తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు రౌండర్ షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.


Similar News