బంగ్లాతో రెండో టెస్టులో పట్టు బిగిస్తున్న శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు
ఆతిథ్య బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా శ్రీలంక బలమైన అడుగు వేసింది.
దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా శ్రీలంక బలమైన అడుగు వేసింది. చటోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 314/4 స్కోరుతో ఆదివారం ఆట కొనసాగించిన ఆ జట్టు 217 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు ధనంజయ డి సిల్వ(70), చండిమాల్(59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అలాగే, భీకర ఫామ్‌లో ఉన్న కమింద్ మెండిస్(92) మరోసారి సత్తాచాటాడు. అతను చివరి వరకు అజేయంగా నిలవడంతో శ్రీలంక స్కోరు 500 దాటింది. రెండో రోజు ఆఖర్లో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్(21) అవుటవ్వగా.. జాకీర్ హసన్(28 నాటౌట్), తైజుల్ ఇస్లామ్(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా 476 పరుగులు వెనుకబడి ఉండగా.. మూడో రోజు పోరాడకపోతే ఆ జట్టు మ్యాచ్‌పై ఆశలు వదలుకావాల్సిందే.