Ball Tampering: భారత క్రికెట్‌లో సంచలనం.. ఇషాన్ కిషన్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు

టీమిండియా (Team India) స్టార్ బ్యాట్స్‌మెన్, కీపర్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) చిక్కుల్లో పడ్డారు. క్విన్స్‌లాండ్స్‌ (Queensland)లోని మాకే (Mackay) వేదికగా ఇండియా-ఏ (India-A), ఆస్ట్రేలియా-ఏ (Australia-A) మధ్య జరుగుతోన్న అనధికార టెస్ట్‌ (Unofficial Test)లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) బాల్ ట్యాంపరింగ్‌ (Ball Tampering)కు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-11-03 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా (Team India) స్టార్ బ్యాట్స్‌మెన్, కీపర్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) చిక్కుల్లో పడ్డారు. క్విన్స్‌లాండ్స్‌ (Queensland)లోని మాకే (Mackay) వేదికగా ఇండియా-ఏ (India-A), ఆస్ట్రేలియా-ఏ (Australia-A) మధ్య జరుగుతోన్న అనధికార టెస్ట్‌ (Unofficial Test)లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) బాల్ ట్యాంపరింగ్‌ (Ball Tampering)కు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగో రోజు మ్యాచ్‌లో భాగంగా అంపైర్ క్రెయిగ్‌ (Umpire Craig) అనవసరంగా బంతిని మార్చడం పట్ల ఇషాన్ అతడితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అసహనం వ్యక్తం చేస్తూ అంపర్‌ను తిట్టాడు. అయితే, ఆ మాటలు కాస్త అక్కడే ఉన్న స్టంప్స్ మైక్‌లో క్లియర్‌గా రికార్డ్ అయ్యాయి.

కాగా, నాలుగో రోజు ఆటలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) బంతిపై గాట్లు పెట్టాడని అంపైర్ క్రెయిగ్ (Umpire Craig) గుర్తించి వెంటనే బంతిని మార్చేశాడు. బాల్‌ను ఎందుకు మార్చారని టీమిండియా (Team India) ఆటగాళ్లతో పాటు కీపర్ ఇషాన్ కిషన్ ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా అంపైర్ క్రెయిగ్ బంతిని మొత్తం చెడగొట్టారని.. నువ్వే స్క్రాచ్‌ చేశావంటూ ఇషాన్‌పై ఫైర్ అయ్యాడు. అందుకే బాల్ చేంజ్ చేశానని తెలిపాడు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్‌ (Ishan Kishan)పై వచ్చి బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు నిజమైతే అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News