బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌కు భారత జట్టు ఎంపిక

ఈ నెల 28 నుంచి ఇండోనేషియా వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్ టోర్నీ జరగనుంది.

Update: 2024-06-25 19:03 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 28 నుంచి ఇండోనేషియా వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం జట్టును ఖరారు చేసింది. సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించి 18 మందితో కూడిన జట్టును వెల్లడించింది. సీనియర్ షట్లర్ తన్వి శర్మ ఈ జట్టుకు నాయకత్వం వహించనుంది. సింగిల్స్‌లో ప్రణయ్ శెట్టిగార్, అలీషా నాయక్, ధ్రువ్ నెగి, నవ్య కందేరిపై అంచనాలు ఉన్నాయి. ఈ టోర్నీలో మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో భారత్.. ఆతిథ్య ఇండోనేషియా, వియత్నం, ఫిలిప్సీన్స్‌ జట్లతో కలిసి గ్రూపు-సిలో ఉన్నది. తొలి మ్యాచ్‌లో వియత్నంతో భారత షట్లర్లు తలపడనున్నారు. టీమ్ ఈవెంట్ తర్వాత వ్యక్తిగత ఈవెంట్ ప్రారంభంకానుంది.

భారత జట్టు

బాయ్స్ సింగిల్స్ : ప్రణయ్, ధ్రువ్, రౌనక్ చౌహాన్, ప్రణవ్ రామ్

బాయ్స్ డబుల్స్ : అర్ష్ మహమ్మద్-సంస్కర్ సరస్వత్, భార్గవ్ రామ్-విశ్వ తేజ

గర్ల్స్ సింగిల్స్ : తన్వి శర్మ, నవ్య, అలీషా నాయక్, ఆదర్శని శ్రీ

మిక్స్‌డ్ డబుల్స్ : భార్గవ్ రామ్-వెన్నెల, వంశ్ దేవ్-శ్రావణి.


Similar News