PV Sindhu Golden Temple: గోల్డెన్టెంపుల్ను సందర్శించిన పీవీ సింధు..
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పంజాబ్.. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పంజాబ్.. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. తొలిసారి దేవాలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే మొదటిసారి గోల్డెన్ టెంపుల్‌ను దర్శించడం తనకెంతో ఆనందంగా ఉందని సింధు సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న సచ్‌ఖండ్ శ్రీ దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్న తర్వాత తన మనసుకు చాలా ప్రశాంతత లభించిందని ఆమె చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సింధు.. అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సింధును గోల్డెన్ టెంపుల్కమిటీ సభ్యులు సన్మానించారు. త్వరలోనే ఒలింపిక్స్ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనున్నట్లు ఆమె తెలిపారు. చివరగా.. ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సింధు సూచించారు.