ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు కఠిన డ్రా
మలేషియా వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ జరగనుంది.
దిశ, స్పోర్ట్స్ : మలేషియా వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన డ్రాను నిర్వాహకులు మంగళవారం రిలీజ్ చేశారు. భారత పురుషుల, మహిళల జట్లకు కఠిన డ్రా లభించింది. ఇరు జట్లు బలమైన చైనాతో తలపడనున్నాయి. పురుషుల జట్టు చైనా, హాంకాంగ్‌లతో గ్రూపు ఏలో ఉన్నది. పురుషుల జట్టులో సింగిల్స్‌ను హెచ్ఎస్ ప్రణయ్ నడిపించనుండగా.. డబుల్స్‌కు సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ నాయకత్వం వహించనుంది. మరోవైపు, మహిళల జట్టుకు స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు నాయకత్వం వహిస్తుంది. గ్రూపు డబ్ల్యూలో మహిళల జట్టు చైనాతో ఆడనుంది. గ్రూపు నుంచి టాప్-2 జట్లు తర్వాతి రౌండ్‌కు చేరుకుంటాయి. మహిళల జట్టు గ్రూపులో చైనాతో మాత్రమే ఆడుతుండటంతో తర్వాతి రౌండ్‌కు చేరుకోవడం ఖాయమే. ఈ టోర్నీ ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబర్ కప్‌లకు అర్హత టోర్నీగా ఉన్నది. గత ఎడిషన్‌లో పురుషుల, మహిళల జట్టు నాకౌట్ రౌండ్లోనే నిష్ర్కమించగా.. ఈ సారి పోడియం చేరుకోవడంపై ఫోకస్ పెట్టాయి.