కోహ్లీ రనౌట్‌పై అనిల్ కుంబ్లే అసహనం.. అది ‘ఆత్మహత్యే’ అంటూ సంచలన వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ రనౌట్‌పై భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

Update: 2024-11-01 19:15 GMT
కోహ్లీ రనౌట్‌పై అనిల్ కుంబ్లే అసహనం.. అది ‘ఆత్మహత్యే’ అంటూ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ రనౌట్‌పై భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అనవసర పరుగుకు యత్నించి అవుటైన తీరు చూస్తుంటే ఇది ‘ఆత్మహత్య’గా అనిపిస్తుందని చెప్పాడు. తొలి రోజు రచిన్ రవీంద్ర వేసిన ఆఖరి ఓవర్‌లో విరాట్(4) రనౌట్‌గా వెనుదిరిగాడు. అనవసర పరుగుకు యత్నించే క్రమంలో కోహ్లీని మ్యాట్ హెన్రీ డైరెక్ట్ త్రోతో పెవిలియన్ పంపాడు. తొలి రోజు ఆట అనంతరం కోహ్లీ రనౌట్‌పై కుంబ్లే స్పందించాడు. ‘మీకు ప్రతి గేమ్‌లో ఇలా పదేపదే జరగకూడదని కోరుకుంటాం. కానీ, ప్రస్తుతానికి ఇది ఆందోళన కంటే ఎక్కువ ఇంబ్బందిగా ఉంది. ఆఖరి ఓవర్‌లో, మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా కోహ్లీ రనౌట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఇది ఆత్మహత్యే.’ అని కుంబ్లే తెలిపాడు.

Tags:    

Similar News