శ్రేయస్ అయ్యర్‌ను రిలీజ్ చేయడంపై కేకేఆర్ సీఈవో కీలక వ్యాఖ్యలు

ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌(కేకేఆర్) వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Update: 2024-11-01 19:07 GMT
శ్రేయస్ అయ్యర్‌ను రిలీజ్ చేయడంపై కేకేఆర్ సీఈవో కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌(కేకేఆర్) వచ్చే సీజన్ కోసం రిటైన్ చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా శ్రేయస్‌ను వదులుకోవడంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ రిటెన్షన్ జాబితాలో అయ్యర్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పాడు. ‘రిటెన్షన్‌లో చాలా విషయాలు ప్రభావం చూపుతాయి. రిటెన్షన్ పరస్పర అంగీకారానికి సంబంధించినదని చాలా మందికి అర్థం కాదు. ఫ్రాంచైజీకి ఏకపక్షంగా ఉండే హక్కు కాదు. ఆటగాడు కూడా చాలా విషయాలు పరిగణలోకి తీసుకుని ఒప్పందం చేసుకుంటాడు. కొన్ని సార్లు డబ్బు లేదు తమ విలువను తెలుసుకోవడానికి ఆటగాళ్లు వేలంలోకి వెళ్తారు. కారణం ఏదైనా కొన్పిసార్లు ఒప్పందం జరగదు. శ్రేయస్ మా జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతను అద్భుతంగా పనిచేశాడు. కానీ, కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తమకు ఏది ఉత్తమమో ఆ దిశను నిర్ణయించుకోవాలి.’ అని తెలిపాడు. కాగా, అయ్యర్‌ను రిలీజ్ చేసిన కేకేఆర్.. రింకు సింగ్, సునీల్ నరైన్, రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను అంటిపెట్టుకుంది.  

Tags:    

Similar News