బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ మెయిన్ డ్రాకు మాళవిక అర్హత

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ మాళవిక బాన్సోద్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది.

Update: 2024-04-09 15:50 GMT

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ మాళవిక బాన్సోద్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వాలిఫయర్స్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ముందడుగు వేసింది. మొదటి మ్యాచ్‌లో 21-18, 21-10 తేడాతో నురాని రాతు అజ్రాహా(యూఏఏ)పై, రెండో మ్యాచ్‌లో సోఫియా జకిరోవా(ఉజ్బెకిస్తాన్)పై 21-4, 21-5 తేడాతో మాళవిక విజయం సాధించింది. ఉమెన్స్ డబుల్స్‌లో రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా , సిమ్రాన్ సింఘి-రితిక థాకర్ జంటలు మెయిన్ డ్రాకు అర్హత సాధించాయి. పురుషుల డబుల్స్‌లో హరిహరన్-రుబాన్ కుమార్, మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్-ఆద్య జోడీలు కూడా ముందడుగు వేశాయి. బుధవారం తొలి రౌండ్‌లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ పోటీ పడనున్నారు. 

Tags:    

Similar News