ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అభిషేక్ క్వాలిఫై

భారత షట్లర్ అభిషేక్ యెలిగర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.

Update: 2024-06-11 19:49 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత షట్లర్ అభిషేక్ యెలిగర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. సిడ్నీలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం అభిషేక్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. మొదట రౌండ్‌లో సహచరుడు శశ్వత్ దలాల్‌పై 21-14, 21-5 తేడాతో నెగ్గిన అభిషేక్.. రెండో రౌండ్‌లో జీ యింగ్ చాన్(ఆస్ట్రేలియా)ను 21-15, 21-14 తేడాతో ఓడించి మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యాడు. మెయిన్ డ్రా తొలి రౌండ్‌లో అభిషేక్ వరల్డ్ నం.53 మిషా జిల్బెర్‌మాన్(ఇజ్రాయిల్)తో తలపడనున్నాడు. మరోవైపు, ఉమెన్స్ డబుల్స్‌లో భారత షట్లర్లు హర్షిత, శృతిలకు నిరాశే ఎదురైంది. తొలి రౌండ్‌లో భారత జోడీ 21-19, 21-19 తేడాతో డానియా నుగ్రోహో-కై క్వి టెయోహ్(ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. భారత స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ నేడు తొలి రౌండ్‌‌లో ఇగోర్ కోయెల్హో(బ్రెజిల్)తో తలపడనున్నాడు. 


Similar News